విప‌క్ష కూట‌మి అధికారంలోకి వ‌స్తే అగ్నివీర్ ర‌ద్దు: రాహుల్

73చూసినవారు
విప‌క్ష కూట‌మి అధికారంలోకి వ‌స్తే అగ్నివీర్ ర‌ద్దు: రాహుల్
అగ్నివీర్ స్కీమ్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ల‌క్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమ‌ర్శ‌లు గుప్పించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల అనంత‌రం తాము అధికారంలోకి రాగానే ఈ ప‌ధ‌కాన్ని ర‌ద్దు చేస్తామ‌ని పున‌రుద్ఘాటించారు. హ‌రియాణ‌లోని మ‌హేంద్ర‌ఘ‌ఢ్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌ను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ప్ర‌ధాని మోదీ భార‌త సైనికుల‌ను కూలీలుగా మార్చార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అగ్నివీర్ స్కీమ్‌ను ప్ర‌ధాని కార్యాల‌యం రూపొందించింద‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్