IPL-2025లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. రచిన్ రవీంద్ర 41, శివమ్ దూబే 19 పరుగులకు ఔట్ అయ్యారు. పదమూడో ఓవర్లో యాష్ దయాల్ వేసిన మొదటి బంతికి రచిన్ రవీంద్ర బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరారు. అదే ఓవర్లో ఐదో బంతికి శివమ్ దూబే బౌల్డ్ అయ్యి వెనుదిరిగారు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి CSK స్కోర్ 81/6గా ఉంది.