రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నష్టపరిహారం డబ్బుల జమ

68చూసినవారు
రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లో నష్టపరిహారం డబ్బుల జమ
AP: కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. అనంతపురం (D) ఉరవకొండ (M) లత్తవరం గ్రామంలో హంద్రీనీవా పిల్ల కాలువ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు ప్రభుత్వం రెండో విడత నష్టపరిహారం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మొత్తం రూ. 45,27,656 రైతుల ఖాతాల్లో జమ అయినట్లు మాజీ సర్పంచ్ బోధ పాటి గోవిందప్ప తెలిపారు. నష్టపరిహారం మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యవులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్