IPL-2025లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో గుజరాత్ టైటాన్స్ దే పైచేయిగా ఉంది. GT మూడు మ్యాచుల్లో గెలవగా, ముంబై కేవలం రెండిటిలో మాత్రమే విజయం సాధించింది.