గుంటూరు కారం ప్రీమియర్ షో.. ఆల్ టైమ్ రికార్డ్!

596చూసినవారు
గుంటూరు కారం ప్రీమియర్ షో.. ఆల్ టైమ్ రికార్డ్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా యూఎస్ఏ ప్రీమియర్ షోలు జనవరి 11న పడనున్నాయి. అక్కడ మొత్తంగా 5,408కి పైగా ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని చిత్రబృందం పేర్కొంది. కాగా, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్