AP: శాసనమండలి లాబీలో బుధవారం మర్రి రాజశేఖర్ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా. నా రాజీనామాను వెంటనే ఆమోదించాలని ఛైర్మన్‌ను కోరా. వైసీపీ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేస్తా' అని వెల్లడించారు. కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.