పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న మూవీ 'హరి హర వీర మల్లు'. ఈ చిత్రంలో బాబీ దేవోల్ విలన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో రాజుల కాలం నాటి దుస్తుల్లో ఉన్న బాబీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా 2025 మార్చి 28న ఈ చిత్రం మొదటిభాగం రిలీజ్ కానుంది.