వయనాడ్ జిల్లాలో ఇటీవల ఓ మహిళపై దాడి చేసి చంపిన పులిని అక్కడి ప్రభుత్వం మ్యాన్ ఈటర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆ పులి మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రకటించింది. సోమవారం తెల్లవారుజామున పులి కళేబరాన్ని అటవీ ప్రాంతంలో గుర్తించినట్లు పేర్కొన్నారు. పులి శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా మరో క్రూర మృగం దాడిలో అది మరణించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు చీఫ్ ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకారియా తెలిపారు.