AP: వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. విశాఖలోని భీమునిపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపునకు అయ్యే ఖర్చులను వసూలు చేయాలని జీవీఎంసీ అధికారులకు హైకోర్టు ఆదేశించింది. ఇంకా నేహారెడ్డి సంస్థలపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణకు పూర్తి నివేదికను సమర్పించాలని సంబంధిత అధికారులకు హైకోర్టు ఆదేశించింది.