హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా

79చూసినవారు
హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా
హర్యానా కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె బీజేపీలో చేరనున్నారు. భివానీ జిల్లా పరిధిలోని తోషమ్ నియోజకవర్గం నుంచి కిరణ్ చౌదరి గెలుపొందారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆమె కుమార్తె శృతి చౌదరికి లోక్‌సభ టిక్కెట్ నిరాకరించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్