అతడే భారత భవిష్యత్ సూపర్ స్టార్: మార్క్‌రమ్

83చూసినవారు
అతడే భారత భవిష్యత్ సూపర్ స్టార్: మార్క్‌రమ్
భారత యువ ప్లేయర్ అభిషేక్ శర్మ‌పై దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. త్వరలో అభిషేక్ టీమిండియా తరఫున అరంగేట్రం చేస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేగాక భవిష్యత్‌లో ఆ భారత కుర్రాడు ఉన్నత స్థాయికి చేరుకుంటాడని తెలిపాడు. పరిస్థితులకు తగ్గట్లుగా సత్తా చాటుతున్నాడని, భవిష్యత్‌లో భారత సూపర్ స్టార్ కావచ్చని పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్