సపోటా పండ్లను తినడం వల్లన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, పీచు పదార్థం, కాల్షియం, కెరోటినాయిడ్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థకు తోడ్పడుతుంది. మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు రోజూ సపోటా పండు తింటే శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది.