TG: హైదరాబాద్‌లో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో రోడ్లపై నీరు భారీ చేరింది. పనివేళలు ముగియడంతో ప్రజలు రోడ్లు మీదకు రాగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనాలు రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్ 10, 12లో బంపర్ టు బంపర్ జామ్ అయింది. రోడ్ నెం 1 నుంచి GVK , నాగార్జున సర్కిల్, పంజాగుట్ట వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ అధికారులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేస్తున్నారు.