TG: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కూడా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. హైదరాబాద్ GHMC అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. GHMC పరిధిలోని ఆరు జోన్లలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.