పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగాట్ అనర్హతపై బీజేపీ ఎంపీ, బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘కేవలం 100 గ్రాముల కారణంగా అనర్హతకు గురికావడం తనని ఆశ్చర్యానికి గురిచేస్తోందని, బరువు విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా బరువు తగ్గించుకోవడం ఎంత ముఖ్యమో గుర్తించాలి. ఆమె త్వరగా ఆ 100 గ్రాములు కోల్పోతుందని ఆశిస్తున్నాను. కానీ పతకాన్ని అయితే మనం పొందలేము కదా’ అంటూ వ్యాఖ్యానించారు.