AP: విశాఖలోని కైలాసగిరి కొండపై భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి. శుక్రవారం కైలాసగిరిపై పాత టైర్లకు మంట పెట్టడంతో పెద్దఎత్తున అగ్నికీలలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా మంటలు ఎగసిపడటంతో వ్యాపారులు, పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.