రూమ్ ఇవ్వలేదని హోటల్ మేనేజర్‌ను నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు (వీడియో)

1046చూసినవారు
మధ్యప్రదేశ్‌లో దారుణ సంఘటన జరిగింది. రూమ్ ఇవ్వలేదన్న కారణంగా ఓ హోటల్ మేనేజర్‌ను కొంతమంది దుండగులు తీవ్రంగా కొట్టారు. జబల్‌పూర్‌లో సోను తివారీ అనే వ్యక్తి రూమ్ తీసుకోవడానికి ఓ హోటల్‌కి వెళ్లాడు. అయితే అక్కడి మేనేజర్ ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు అడిగారు. అతడు ఎటువంటి కార్డు ఇవ్వకపోవడంతో గదిని ఇవ్వడానికి మేనేజర్ నిరాకరించారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఆ యువకుడు కొంతమందిని తీసుకువచ్చి నడిరోడ్డుపై మేనేజర్‌ను తీవ్రంగా దాడి చేశాడు.

సంబంధిత పోస్ట్