BRS అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం స్టేషన్‌ఘన్‌పూర్ సభలో సీఎం మాట్లాడుతూ.. "తెలంగాణకు జాతిపిత తాగుబోతోడు అవుతాడా.. త్యాగాలు చేసినోళ్లు అవుతారా? ఆ జాతిపిత ఎక్కడ.. ఈ జాతిపిత ఎక్కడ? జాతి పిత అంటే కొండా లక్షణ్ బాపూజీనో.. ప్రొ.జయశంకర్ సారో జాతిపిత అవుతారు. టీవీలు, పేపర్లు పెట్టుకుని.. రూ.లక్షల కోట్లు దోచినోళ్లు జాతిపిత ఎలా అవుతారు?" అని నిలదీశారు.