ఇంటిపైకి దూసుకొచ్చిన భారీ కంటైనర్ (వీడియో)

65చూసినవారు
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. బ్రిటన్‌లోని లంకాషైర్‌లోని విగాన్‌లో ఓ బాలిక తన ఇంటి ముందు సైకిల్ తొక్కుతోంది. మరోవైపు, ఇంటి సమీపంలో రోడ్డుపై పడి ఉన్న భారీ కంటైనర్‌ను క్రేన్ సహాయంతో పైకి లేపుతున్నారు. అదే సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక, దాన్ని గమనించిన అప్రమత్తమైంది. అకస్మాత్తుగా తన సైకిల్‌ను వదిలి ఇంటి వైపు పరుగెత్తుకుంటూ వెళ్ళింది. మరుక్షణమే కంటైనరు ఇంటి పైకప్పును పగులగొట్టుకుంటూ లోపలికి దూసుకువచ్చింది.

సంబంధిత పోస్ట్