ఏడిస్తే ఆరోగ్యానికి మంచిదేనా ?

58చూసినవారు
ఏడిస్తే ఆరోగ్యానికి మంచిదేనా ?
ఏడిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారో, బలహీనతగా చూస్తారని తమ బాధని మనసులో నొక్కిపెట్టేవారే అధికం. అలా చేస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణుల అభిప్రాయం. మనస్సులో బాధ గూడు కట్టుకుంటే మనం ఆలోచించే శక్తిని కోల్పోతాము. బాధ పోవడానికి తనివితీరా ఏడవాలి. అప్పుడు మనసంతా తేలిక పడినట్టు అనిపిస్తుంది. కారణం.. ఏడ్చిన తర్వాత మెదడు ఆక్సిటోసిన్‌, ఎండార్ఫిన్లు వంటి మనసు తేలికపడే హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో మనసు తేలికపడుతుంది.

సంబంధిత పోస్ట్