ముంబయిలోని ఐఐటీ బాంబే క్యాంపస్‌లో భారీ మొసలి దర్శనమిచ్చింది. పక్కనే ఉన్న సరస్సు నుంచి ఓ మొసలి క్యాంపస్ లోకి ప్రవేశించింది. క్యాంపస్‌లోని రోడ్డుపై భారీ మొసలి కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, జంతు ప్రేమికులు అక్కడికి చేరుకొని ఆ మొసలి వల్ల ఎవరికీ ఏమీ జరుగకుండా చూశారు. తర్వాత మొసలి సరస్సులోకి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.