బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి

70చూసినవారు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్‌లోని ధామ్నాలో గల బాణాసంచా తయారీ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ పేలుడు ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్‌ కమిషనర్‌ రవీందర్‌ సింఘాల్‌ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్