వారికి కేరళ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం

82చూసినవారు
వారికి కేరళ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం
కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనలో దుర్మరణం పాలైన కేరళ పౌరులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సాయం అందించనున్నారు. కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది.ప్రభుత్వానికి అందిన సమాచారం ప్రకారం, ఈ ఘటనలో కేరళకు చెందిన 19 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. అలాగే, ఈ ఘటనలో గాయపడిన వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్