భారీగా పెరిగిన విమాన ఛార్జీలు!

61చూసినవారు
భారీగా పెరిగిన విమాన ఛార్జీలు!
ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈనెల 11 నుంచి 13 వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, విమాన టికెట్ ధరలు 20-30% పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్-వైజాగ్‌కి రూ.4,500 ఉండే టికెట్ ధర ఈనెల 12వ తేదీకి రూ.6,500కి చేరింది. హైదరాబాద్-కొచ్చికి రూ.5వేల నుంచి రూ.7వేలకు పెరిగింది. రద్దీని బట్టి ఛార్జీలుంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్