TG: హైదరాబాద్ అంబర్ పేట్ దారుణం జరిగింది. నవీన్ అనే వ్యక్తికి రేఖతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. గత కొన్ని నెలల నుంచి భార్యపై అనుమానంతో నవీన్ తరచూ తాగొచ్చి వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో గత వారం మళ్లీ గొడవ జరగ్గా.. బైక్‌లో ఉన్న పెట్రోల్ తెచ్చి భార్యపై పోసి నిప్పంటించాడు. సగం కాలిన తర్వాత మంటలను ఆర్పి ఆసుపత్రికి తరలించి రేఖ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపాడు. దీంతో రేఖ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందిందని పోలీసులు పేర్కొన్నారు.