విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డ అన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా హెచ్ఐసీసీలో నిర్వహించిన ఏఐ సదస్సులో సీఎం మాట్లాడారు. హైదరాబాద్ సిటీ ఐటీ రంగంలో దేశంలో అగ్రగామిగా నిలిచిందిని అన్నారు. ఏఐ అనేది నేటి తరం అద్భుత ఆవిష్కరణ అని కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే ప్రపంచం ఎన్నటికి మారదని తెలిపారు. ఎవరో ఒకరి ఇన్నోవేషన్ ప్రపంచంతో పాటు ప్రజల జీవితాల్లో మర్పులు తెస్తుందని అన్నారు.