ఏ వ్యక్తిపై అయిన సరే అభియోగాలు వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు, చట్ట ప్రకారం అతడిపై కేసు నమోదైనప్పుడు చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయిందని, అయన కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నమైందన్నారు. ఈ విషయంపై అల్లు అర్జున్ కనీసం స్పందించలేదని, తప్పు జరిగింది కాబట్టి స్టార్ అయిన కూడా పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.