సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సభావత్ శ్రీనివాస్ నాయక్, కాంగ్రెస్ నేత సభావత్ విజయ మంగళవారం బీజేపీ పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమాలకు ఆకర్షితులై వారు బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ పాల్గొన్నారు.