బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కుమార్ అధ్వర్యంలో ఆదివారం బాగ్ అంబర్ పేట్ సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో ఆదివారం అయ్యప్ప స్వామి మహ పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొని భజనలతో హోరెత్తించారు. భక్తి భావం పెంపొందించుకోవడంతో ప్రశాంత జీవనం సాగించేందుకు వీలుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. భక్తి గీతాలు ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తాయన్నారు. మొత్తంగా పూజ కన్నులపండువగా జరిగింది.