నూతనంగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతుళ్ళకు బాట పట్టిన వారు చర్లపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. ప్రయాణికులతో ప్లాట్ ఫారంలు సందడిగా మారాయి. పండుగ నేపథ్యంలో రైళ్ళను మరింతగా పెంచాలని, అదేవిధంగా అన్ని సదుపాయాలను కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు.