జలమండలి ఓఅండ్‌యూ డివిజన్2(బి) బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఎండీపీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో రెండు రోజులు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం రాత్రి 9 గంటల వరకు రిజర్వాయర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.