హైదరాబాద్: బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంపై దుష్ప్రచారం: మంత్రి సీతక్క
బీజేపీకి బీటీమ్ బీఆర్ఎస్ అని మంత్రి సీతక్క విమర్శించారు. మహారాష్ట్రలో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు బీఆర్ఎస్ కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఇందుకోసం ఆటో డ్రైవర్లను ఉసి గొల్పి ధర్నాలు చేయిస్తున్నారని చెప్పారు. పంట రుణమాఫీని చేయని బీఆర్ఎస్ రైతుల ప్రేమ కురిపించడం విడ్డూరమన్నారు.