
హైదరాబాద్: రేపు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు. కాగా మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు దాదాపు 9.96 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.