

అంబర్ పేట్: బీజేపీ నాయకుల అధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు
అంబర్ పేట్ డీడీ కాలనీలో బీజేపీ నాయకులు రాంరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీరామ నవమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. సీతారాముల కళ్యాణ మహోత్సవంలో బీజేపీ జాతీయ నాయకులు మురళీధర్ రావు, ఎంపీ. ఆర్. కృష్ణయ్య, బీజేపీ సీనియర్ నాయకులు గౌతమ్ రావు పాల్గొని భక్తులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై శ్రీరాముల వారి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని, స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.