
అంబర్ పేట్: డ్రైనేజీ లైన్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
గోల్నాక న్యూ అంబేద్కర్ నగర్ లో రూ. 24 లక్షల నిధులతో నూతనంగా చేపట్టనున్న డ్రైనేజీ పైపు లైన్ నిర్మాణ పనులకు గురువారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, స్థానిక కార్పొరేటర్ దూసరీ లావణ్య శ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.