హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని శాలిబండ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ ముస్తఫా అలీ ముజాఫర్ ఆదివారం కలిశారు. ఎంఐఎం కార్యాలయంలో ఎంపీని కలిసి డివిజన్ పరిధిలోని కొనసాగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. మరిన్ని అభివృద్ది పనుల కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. అలాగే డివిజన్ పరిధిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవాలని కోరారు. దీనిపై ఎంపీ సానుకూలంగా స్పందించినట్లు కార్పొరేటర్ తెలిపారు.