విద్యుత్ శాఖ ఎండీ ముషారఫ్ ఫారుఖితో బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ కార్పొరేటర్లతో కలిసి శుక్రవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అలాగే నూతన అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు.