గాంధీ భవన్ ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. గంట పాటు గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ఫ్లెక్సీలను బీజేపి నాయకులు చించివేశారు. ఉదయం బీజేపీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ నిరసన చేపట్టడాన్ని ఖండించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.