హైదరాబాద్‌: రోడ్డుప్రమాదంలో ఏడుగురు మృతి.. గాంధీ ఆస్పత్రికి మృతదేహాలు

61చూసినవారు
హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు నిన్న మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌ నుంచి 7 మృతదేహాలను సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు అంబులెన్సుల్లో 7 మృతదేహాలు హైదరాబాద్‌కు తరలించారు. మృతుల కుటుంబీకులు గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో సిబ్బంది మృతదేహాలను బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్