కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. తన మేధావితనాన్ని ప్రజలకు పంచాలని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 'ఎకరంలో రూ.కోటి పంట ఎలా పండించారో రైతులకు చెప్పాలి. బీసీ కులగణనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు పాల్గొనడంలేదు. ఈ ముగ్గురూ బీసీ వ్యతిరేకులా? బీసీల ఓట్లు వేయించుకోలేదా? ఒక మంచి పని కోసం ప్రభుత్వాలు ముందుకొచ్చినప్పుడు సహకరించాలి. బీసీ కులగణనలో పాల్గొనని వారిని ఈ సమాజం బహిష్కరించాలని కోరుతున్నా’’ అని చెప్పారు.