హైదరాబాద్‌లో కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో 100% బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కుమారస్వామిని కార్యాలయంలో సీఎం కలిసి చర్చించారు. PM E-Drive పథకం కింద జీసీసీ పద్ధతిలో తెలంగాణకు బస్సులు కేటాయించాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు.