చార్మినార్ నుంచి తిగలకుంట వరకు నూతనంగా ఏర్పాటు చేసిన బస్ సర్వీసును బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇటీవల ఆర్టీసీ అధికారుల దృష్టికి ప్రయాణికుల సమస్యలను తీసుకెళ్తామన్నారు. ప్రతిరోజు ఎక్కువ మంది ప్రయాణించే మార్గంలో బస్ సర్వీస్ ఏర్పాటు చేయాలని గతంలో కోరినట్లు తెలిపారు. చార్మినార్ నుంచి తీగలకుంట, తిగాలకుంట నుంచి సికింద్రబాద్ వరకు సర్వీస్ నడుస్తోందన్నారు.