భారీ వర్షానికి కూలిన ప్రహరీ గోడ

71చూసినవారు
హైదరాబాద్ భాగ్యనగరంలో మంగళవారం తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలిపోయింది. బషీర్ బాగ్ లోని సీసీఎస్ పాత కార్యాలయం కు ఆనుకోని ఉన్న ప్రహరీ గోడ ఒకసారిగా కూలిపోయి క్రింద పడిపోయింది. ప్రహరి గోడ కూడలడంతో దానికి అనుకొని ఉన్న చెట్లు సైతం విరిగి క్రింద పడ్డాయి. గోడ కూలడంతో ఆప్రాంతంలో పార్కింగ్ చేసి ఉన్న రెండు పోలీసు వాహనాలు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్