హైదరాబాద్ నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీసులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. నగర పరిధిలో ఇకపై మతపరమైన ర్యాలీల్లో ఎలాంటి డీజేలనూ ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భారీ శబ్దాలతో డీజేలు పెట్టి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు.