బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కల్పించాలని ఇస్కాన్ స్వామిజీ చిన్మోయ్ కృష్ణదాసన్ను వెంటనే విడుదల చేయాలని విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ అబిడ్స్ జీపీవో చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఇస్లామిక్ మతోన్మాదం నశించాలంటూ నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ హిందువుల పక్షాన యువత గళం వినిపించాలని వారు అన్నారు. హిందువుల రక్షణకై భారత ప్రభుత్వం తక్షణ అవసరమా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.