హైదరాబాద్: కార్ల షోరూంలో అగ్నిప్రమాదం

60చూసినవారు
హైదరాబాద్లోని కొండాపూర్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎం బి మాల్ దగ్గర ఉన్న మహీంద్రా కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కార్లు దగ్ధమవుతున్నాయి. షోరూంలో ఉన్న ఎంప్లాయిస్ ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ప్రధాన రోడ్డుపై షోరూం ఉండడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. షోరూం నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్