తెలంగాణ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి , బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా హైదరాబాద్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి రావాలని సవాల్ విసిరారు. “మీ వీపులు పగలకొడతారు” అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.