చంచల్ గూడ జైలు నుంచి విడుదలై గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లిన అల్లు అర్జున్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకుని బన్నీ మీడియాతో మాట్లాడుతున్నారు. నాకు మద్దతు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. నేను బాగున్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన... దురదృష్టకరమైన ఘటన. నేను చట్టాన్ని గౌరవిస్తా. కేసు కోర్టులో ఉంది. నేను ఏమీ మాట్లాడలేను. రేవతి కుటుంబానికి నా సానుభూతి.' అని అన్నారు.