పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దిపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు పాల్గొన్నారు.