బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలను దుండగులు ఎత్తుకెళ్లారు. రోడ్ నం. 2లోని ఇందిరానగర్లో నివసించే వెంకటరమణ కుటుంబసభ్యులతో కలిసి 12న తాళం వేసి ఏపీ రాజమండ్రికి వెళ్లారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని అద్దెకుంటున్న వ్యక్తి చెప్పడంతో హుటాహుటిన వెంకటరమణ ఇంటికి వచ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.